Skip to main content

ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న టీకా పేరు?

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకా ‘కోవిషీల్డ్’ డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నవంబర్ 12న ప్రకటించింది.
Current Affairs
తయారైన డోసులు అంతర్జాతీయ వినియోగానికా? భారత్‌లో పంపిణీ చేసేందుకా తెలిపేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిరాకరించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి.

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా...
ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకి, తగ్గిపోయినట్లు సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు నవంబర్ 12న ఒక నివేదిక సమర్పించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ‘కోవిషీల్డ్’ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
ఎందుకు : కరోనా వైరస్‌ను నివారించేందుకు
Published date : 13 Nov 2020 05:56PM

Photo Stories