Skip to main content

ఆక్సిజన్‌ అవసరాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన సంస్థలు?

కరోనా వైరస్‌ బారినపడిన బాధితుల్లో వెంటిలేటర్‌ సపోర్టు అవసరమైన వారిని గుర్తించేందుకు కోవిడ్‌ సీవియారిటీ స్కోర్‌ (సీఎస్‌ఎస్‌) పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూన్‌ 19న వెల్లడించింది.
Current Affairs ఎమర్జెన్సీ కేసులు, ఐసీయూ సేవలు అవసరమైన వారిని ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించవచ్చని పేర్కొంది. సీఎస్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను కోల్‌కతాలోని ఫౌండేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ హెల్త్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ పరిధిలోని సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

సీఎస్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా... ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అవసరం లేని కోవిడ్‌ బాధితులను ముందే గుర్తించవచ్చు. దీంతో అవసరమైన వారికి పడకలు అందుబాటులోకి వస్తాయని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ తెలియజేసింది. బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలు, ఇతర ఆనవాళ్లు, వారి ఆరోగ్య చరిత్ర ఆధారంగా సీఎస్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ఫలితాన్ని తేలుస్తుందని పేర్కొంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కోవిడ్‌ సీవియారిటీ స్కోర్‌ (సీఎస్‌ఎస్‌) పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి
ఎప్పుడు : జూన్‌ 19
ఎవరు : కోల్‌కతాలోని ఫౌండేషన్‌ ఫర్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ హెల్త్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ పరిధిలోని సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
ఎందుకు : కరోనా వైరస్‌ బారినపడిన బాధితుల్లో వెంటిలేటర్‌ సపోర్టు అవసరమైన వారిని గుర్తించేందుకు...
Published date : 21 Jun 2021 07:43PM

Photo Stories