Skip to main content

ఐయూఎఫ్‌ఆర్‌వోలో తెలంగాణ ఏపీసీసీఎఫ్

బ్రెజిల్‌లోని క్యూరీటుబాలో జరుగుతున్న 25వ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఐయూఎఫ్‌ఆర్‌వో) సమావేశంలో అక్టోబర్ 4న తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(ఏపీసీసీఎఫ్) లోకేశ్ జైస్వాల్ పాల్గొన్నారు.
తెలంగాణలో పచ్చదనం పెంచేందుకు, అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి ఈ సమావేశంలో లోకేశ్ వివరించారు. అలాగే సిద్దిపేట జిల్లాలోని ‘గజ్వేల్-ములుగు అటవీ ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించారు.

2019, సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశాలు అక్టోబర్ 5న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో 110 దేశాల్లో విధాన రూపకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంస్థలతో కూడిన ప్రపంచ నెట్‌వర్క్, భాగస్వామ్యపక్షాలు పాల్గొన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐయూఎఫ్‌ఆర్‌వో సమావేశంలో
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : తెలంగాణ ఏపీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్
ఎక్కడ : క్యూరీటుబా, బ్రెజిల్
Published date : 05 Oct 2019 05:37PM

Photo Stories