ఐటీఎఫ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ సాధించిన జంట?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని తన కెరీర్‌లో 22వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో సాకేత్ భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో జతగా ఆడి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సాకేత్–అర్జున్‌లతో ఏప్రిల్ 3న జరగాల్సిన ఫైనల్లో తలపడాల్సిన సోంబోర్ వెల్జ్ (హంగేరి)–సిర్సినా (చెక్ రిపబ్లిక్) జోడీ బరిలోకి దిగకుండా ‘వాకోవర్’ ఇచ్చింది. దీంతో సాకేత్ జంటను విజేతగా ప్రకటించారు.
స్కేటింగ్‌లో తెలంగాణ బాలుర జట్టుకు స్వర్ణం
జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాడెట్ బాలుర విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. చండీగఢ్‌లో ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో తెలంగాణ జట్టు 4–3 గోల్స్ తేడాతో హరియాణా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. తెలంగాణ జట్టులో శౌర్య, ఆదిత్య, హరికీర్తన్, కార్తీక్, అర్ణవ్, మారుతి కృష్ణన్, శ్యామల రితీశ్ రెడ్డి, మృదుల్ నారాయణ్, విక్షిత్ వర్ధన్, గులామ్ అహ్మద్ రజా ఖాన్, యథార్థ్ రావు, వీవీవీఎస్‌ఎస్ శాస్త్రి సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో డబుల్స్ టైటిల్ సాధించిన జంట?
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : సాకేత్ మైనేని–అర్జున్ ఖడే ద్వయం
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 05 Apr 2021 06:02PM