Skip to main content

ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో నికీ కలియంద పునాచా (భారత్‌) విజేతగా నిలిచాడు.
Current Affairs
న్యూఢిల్లీలో ఏప్రిల్‌ 4న జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల నికీ పునాచా 6–3, 7–6 (7/5)తో నాలుగో సీడ్‌ ఒలీవర్‌ క్రాఫోర్డ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. నికీ కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌. 2018లో తొలిసారి అతను ఇండోనేసియా ఫ్యూచర్స్‌–3 టోర్నీ టైటిల్‌ను గెలిచాడు.

మయామి ఓపెన్‌ మళ్లీ బార్టీదే...
ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మయామి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకుంది. బియాంక (కెనడా)తో జరిగిన ఫైనల్లో బార్టీ 6–3, 4–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. 2019లోనూ ఈ టోర్నీలో బార్టీ విజేతగా నిలిచింది. కరోనా కారణంగా 2020 ఏడాది ఈ టోర్నీ జరగలేదు. విజేతగా నిలిచిన బార్టీకి 3,00,100 డాలర్ల (రూ. 2 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు : కలియంద పునాచా (భారత్‌)
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 05 Apr 2021 06:03PM

Photo Stories