ఐటీఎఫ్ ఫెడ్ కప్‌కు ఏ టెన్నిస్ క్రీడాకారిణి పేరు పెట్టారు?
Sakshi Education
అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి, కెరీర్ ఆరంభంనుంచి సమానత్వ హక్కుల కోసం పోరాడిన బిల్లీ జీన్ కింగ్ (76)ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అరుదైన రీతిలో గౌరవించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్‌కు బిల్లీ జీన్ కింగ్ పేరు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)
ఎందుకు : మహిళల టెన్నిస్కు సంబంధించి విశేష కృషి చేసినందుకుగాను...
ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్ పేరు మారుస్తూ ఇకపై దీనిని ‘బిల్లీ జీన్ కింగ్ కప్’గా వ్యవహరిస్తామని సెప్టెంబర్ 17న ప్రకటించింది. ఒక టీమ్ ఈవెంట్ టోర్నీని మహిళ పేరుతో వ్యవహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. మహిళల టెన్నిస్ రాత మార్చిన వ్యక్తి పేరును ఇలా టోర్నీకి జత చేయడం సరైన కానుకగా తాము భావిస్తున్నామని ఐటీఎఫ్ అధ్యక్షుడు డేవిడ్ హాగర్టీ చెప్పారు.
జీన్ కింగ్ పోరాటంతోనే...
- బిల్లీ జీన్ కింగ్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ఏకంగా 31 ఏళ్ల పాటు సాగింది.
- మహిళల సింగిల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లూ (మొత్తం 12) ఆమె ఖాతాలో ఉండగా, ఇందులో 6 వింబుల్డన్ టైటిల్స్. మహిళల డబుల్స్‌లో 16, మిక్స్‌డ్ డబుల్స్‌లో 11 కలిపితే ఆమె ఖాతాలో మొత్తం గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 39కు చేరుతుంది.
- పురుషులతో సమానంగా మహిళల టెన్నిస్‌లో కూడా టోర్నీ ఉండాలని, ప్రైజ్‌మనీ కూడా సమానంగా ఇవ్వాలని ఆమె పోరాడింది. తన కెరీర్‌ను పణంగా పెట్టి మహిళా క్రీడాకారిణుల హక్కుల కోసం శ్రమించిన జీన్ కింగ్ కారణంగానే 1973లో మహిళా టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఏర్పాటైంది.
- తన పోరాటంలో భాగంగా పురుష క్రీడాకారుడు బాబీ రిగ్‌సతో ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ మ్యాచ్‌లో తలపడి 6-4, 6-3, 6-3తో గెలవడం ఆమె కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టం.
- డేవిస్ కప్ తరహాలోనే మహిళలకూ టోర్నీ ఉండాలని వాదించిన ఆమె కారణంగానే ‘ఫెడ్ కప్’కు శ్రీకారం పడింది.
- క్రీడాకారిణిగా, కోచ్‌గా కింగ్ 10 ఫెడ్ కప్ టైటిల్స్ విజయాల్లో భాగమైంది. ఇప్పుడు ఈ టోర్నీని జీన్ కింగ్ పేరుతో వ్యవహరించడం సముచితంగా భావించవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్‌కు బిల్లీ జీన్ కింగ్ పేరు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)
ఎందుకు : మహిళల టెన్నిస్కు సంబంధించి విశేష కృషి చేసినందుకుగాను...
Published date : 18 Sep 2020 05:22PM