Skip to main content

ఐటీ ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం

ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్(ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు)కు జనవరి 16న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.4,242 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (ఐటీ) ఇన్ఫోసిస్‌ను ప్రభుత్వం ఎంపికచేసింది. ఐటి ఫైలింగ్ ప్రాజెక్టు ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్ చేసే సమయం 63 రోజుల నుంచి 24 గంటలకు తగ్గిపోతుంది.

నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు
అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్‌కు క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్‌లైన్ ఏర్పాటవుతుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది.

మరోవైపు ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐటీ ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 17 Jan 2019 05:47PM

Photo Stories