ఐసీసీ టోర్నీలో తొలి మహిళా రిఫరీగా జీఎస్ లక్ష్మి
Sakshi Education
2019, డిసెంబర్‌లో పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ గండికోట సర్వ (జీఎస్) లక్ష్మి మరో ఘనతను సాధించనున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు. రాజమహేంద్రవరంకి చెందిన 51 ఏళ్ల జీఎస్ లక్ష్మి 2020, ఫిబ్రవరి 21న ఆస్ట్రేలియాలో మొదలుకానున్న మహిళల టి20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మెగా టోర్నీకి మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించే ముగ్గురిలో ఏకై క మహిళ జీఎస్ లక్ష్మినే. లక్ష్మితోపాటు స్టీవ్ బెర్నార్డ్, క్రిస్ బ్రాడ్‌లను మ్యాచ్ రిఫరీలుగా ఐసీసీ నియమించింది.
Published date : 13 Feb 2020 05:48PM