Skip to main content

ఐసీసీ టి20 ప్రపంచకప్‌ను ఏయే దేశాల్లో నిర్వహించనున్నారు?

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌ వేదికల్ని, షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
Current Affairs
2021, అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరుగుతుందని ఐసీసీ జూన్‌ 29న ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్, షార్జా, అబుదాబీ వేదికల్లో ప్రధాన మ్యాచ్‌లు జరుగుతాయి. 8 జట్లు తలపడే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ను ఒమన్, యూఏఈలలో నిర్వహిస్తారు.

చివరిసారి 2016లో...
చివరిసారి 2016లో భారత్‌లో పురుషుల టి20 ప్రపంచకప్‌ జరిగింది. ఇంగ్లండ్‌ను ఓడించి వెస్టిండీస్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పురుషుల విభాగంలో టి20 మెగా ఈవెంట్‌ ఇప్పుడే జరుగనుంది. నిజానికి ఇది కూడా భారత్‌లోనే నిర్వహించాల్సి ఉన్నా... కరోనా వల్ల మార్పుచేయక తప్పలేదు. అయితే ఆతిథ్య హోదా భారత్‌దే! ఆటగాళ్లు, ఇతర స్టేక్‌ హోల్డర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా యూఏఈలో నిర్వహిస్తున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2021, అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఐసీసీ టి20 ప్రపంచకప్‌ నిర్వహణ
ఎప్పుడు : జూన్‌ 29
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)
ఎక్కడ : ఒమన్, యూఏఈ
ఎందుకు : ఆతిథ్య దేశం భారత్‌లో కరోని ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో...
Published date : 30 Jun 2021 06:02PM

Photo Stories