ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లికి అగ్రస్థానం
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లోనూ అగ్రస్థానంతో 2019ని ముగించాడు.
ఐసీసీ డిసెంబర్ 24న ప్రకటించిన బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌సల్లో కోహ్లి (928 పాయింట్లు) తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (911) రెండో స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్-2019
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్-2019లో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : విరాట్ కోహ్లి
ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్-2019
ర్యాంకు | పేరు | రేటింగ్ పాయింట్స్ | దేశం |
1 | విరాట్ కోహ్లి | 928 | భారత్ |
2 | స్టీవ్ స్మిత్ | 911 | ఆస్ట్రేలియా |
3 | కేన్ విలియమ్సన్ | 864 | న్యూజిలాండ్ |
4 | చతేశ్వర్ పుజారా | 791 | భారత్ |
5 | మార్నస్ లాబుస్చాగ్నే | 786 | ఆస్ట్రేలియా |
7 | అజింక్య రహానే | 759 | భారత్ |
12 | మయాంక్ అగర్వాల్ | 700 | భారత్ |
15 | రోహిత్ శర్మ | 688 | భారత్ |
- ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) నంబర్‌వన్‌గా ఉన్నాడు. ఈజాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాకు ఆరో స్థానం దక్కింది.
- ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) అగ్రస్థానం సాధించగా.. రవీంద్ర జడేజా (భారత్) రెండో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్-2019లో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : విరాట్ కోహ్లి
Published date : 25 Dec 2019 05:39PM