Skip to main content

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 ఏడాది ప్రవేశపెట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు వరుసగా రెండో నెల కూడా భారత ఆటగాడినే వరించింది.
Current Affairs

మొదటి నెల(జనవరి) అవార్డును రిషభ్‌ పంత్‌ అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (176 పరుగులు; 24 వికెట్లు) కనబరిచిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఫర్‌ ఫిబ్రవరి’ అవార్డుకు ఎంపికయ్యాడు.


జొకోవిచ్‌ ‘టాప్‌’ రికార్డు

పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్‌ ర్యాంకర్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. మార్చి 8న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ 12, 030 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానంలో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు రోజర్‌ ఫెడరర్‌(స్విట్జర్లాండ్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఎంపిక
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : రవిచంద్రన్‌ అశ్విన్‌
ఎందుకు : క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు
Published date : 10 Mar 2021 06:03PM

Photo Stories