ఐసీసీ అంపైర్స్ ప్యానెల్‌కు జనని, వృందా
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) డెవలప్‌మెంట్ అంపైర్స్ అంతర్జాతీయ ప్యానెల్‌లో భారత మహిళా అంపైర్లు జననీ నారాయణ్, వృందా రాఠి చోటు దక్కించుకున్నారు.
దీంతో ఈ ప్యానల్‌లో భారత మహిళా అధికారుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసీసీ రిఫరీస్ ప్యానల్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ అంపైర్స్ ప్యానల్ అనేది పలు రీజియన్లకు చెందిన అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
జననీ నారాయణ్: చెన్నైకి చెందిన 34 ఏళ్ల జనని 2015లో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోకల్ డివిజన్ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరించింది. 2018 నుంచి దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరిస్తోంది. బీసీసీఐ లెవల్-1, లెవల్-2 పరీక్షలోనూ మెరుగ్గా రాణించి.. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది.
వృందా రాఠీ: మాజీ క్రికెటర్, స్కోరర్ అయిన వృందాకు క్రికెట్‌తో మంచి అనుబంధముంది. నవీ ముంబైకి చెందిన ఆమె కాలేజీ స్థాయిలో 2007 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ముంబై యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. 2008-09 ఆలిండియా చాంపియన్‌గా నిలిచిన ముంబై యూనివర్సిటీ జట్టులో సభ్యురాలుగా ఉంది. బీసీసీఐ స్కోరర్‌గా కెరీర్ ప్రారంభించిన వృందా... 2013 మహిళల ప్రపంచ కప్‌లోనూ స్కోరర్‌గా పనిచేసింది. బీసీసీఐ లెవల్-1, లెవల్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ‘బీసీసీఐ దేశవాళీ అంపైర్ల ప్యానల్’లో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ డెవలప్‌మెంట్ అంపైర్స్ అంతర్జాతీయ ప్యానెల్‌కు ఎంపిక
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : జననీ నారాయణ్, వృందా రాఠి

Published date : 19 Mar 2020 05:40PM