Skip to main content

ఐసీఎంఆర్ సలహాదారుగా నియమితులైన ఐఏఎస్ అధికారి?

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు.
Current Affairs
హైదరాబాద్‌ సమీపం షామీర్‌పేట్‌లో ఉన్న జీనోమ్‌ వ్యాలీలో 100 ఎకరాల్లో బయో మెడికల్‌ రీసెర్చ్‌ కోసం ఏర్పాటు చేయబోతున్న ప్రతిష్టాత్మకమైన ‘‘నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ’’కి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్‌.. ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం జంతువులపై ప్రి క్లినికల్‌ ట్రయల్స్‌ చేయడానికి దోహదపడుతుంది.

ఐసీఎంఆర్‌...

ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ఐసీఎంఆర్‌ ప్రస్తుత డెరైక్టర్‌ జనరల్‌: బలరాం భార్గవ్‌

బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా నీరబ్‌...
ప్రస్తుతం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ (సీసీఎల్‌ఏ)గా ఉన్న నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ హోదాను అదనపు మిషన్‌ డైరెక్టర్‌గా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐసీఎంఆర్‌ సలహాదారుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య
Published date : 12 Apr 2021 06:24PM

Photo Stories