Skip to main content

ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్‌ ఒప్పందానికి కేబినెట్‌ ఒప్పందం

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆస్ట్రేలియా అండ్‌ న్యూజిలాండ్‌ (సీఏఏఎన్‌జెడ్‌) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర కేబినెట్‌ ఏప్రిల్‌ 20న ఆమోదం తెలిపింది.
Current Affairs సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్‌ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడగలదు. మరోవైపు ఐసీఏఐ, సర్టిఫైడ్‌ ప్రాక్టీసింగ్‌ అకౌంటెంట్‌ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్‌ మధ్య కుదిరిన ఎంవోయూకి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : పరస్పర సహాకారం, భారత సీఏలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు...
Published date : 21 Apr 2021 07:14PM

Photo Stories