Skip to main content

ఐసీఐసీఐ బ్యాంక్‌లో చైనా బ్యాంకుకు వాటాలు

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ) స్వల్ప వాటాలు కొనుగోలు చేసింది.
Current Affairs
సుమారు రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లను చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 15,000 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసిన 357 సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో పీబీసీ కూడా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకులో పీబీసీకి సుమారు 0.0065 శాతం వాటాలు ఉన్నట్లవుతుంది.

సాధారణంగా సెంట్రల్‌ బ్యాంకులు .. బంగారం, విదేశీ కరెన్సీలు, ప్రభుత్వ.. ప్రైవేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అదే క్రమంలో పీబీసీకొన్నాళ్లుగా భారత్‌లోని పలు బ్లూచిప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తోంది. మార్చి త్రైమాసికంలో గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలోనూ వాటాలను 1 శాతం పైగా స్థాయికి పెంచుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :ఐసీఐసీఐ బ్యాంక్‌లోవాటాల కొనుగోలు
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ)
Published date : 19 Aug 2020 05:13PM

Photo Stories