ఐసీఐడీ-2020 అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన ఏపీ రైతు?
Sakshi Education
ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ)-2020 అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు ప్రకటించింది.
అందులో రైతు విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మేకల శివశంకరరెడ్డి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మిగతా మూడు కేటగిరీలు.. టెక్నాలజీ అవార్డు, మేనేజ్‌మెంట్ అవార్డు, యంగ్ ప్రొఫెషనల్ అవార్డులు ఇరాన్ దేశస్తులు దక్కించుకున్నారు. ఇండోనేషియా వేదికగా త్వరలోనే అవార్డులు ప్రదానం చేయనున్నారు.
అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, ప్రసన్నాయపల్లికి చెందిన అభ్యుదయ రైతు మేకల శివశంకరరెడ్డి ఉద్యాన పంటల సాగులో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నారు. డ్రిప్ పద్ధతిలో ఉద్యాన పంటలు(ప్రధానంగా ద్రాక్ష) సాగు చేసి.. వాటికి పూర్తిగా ఫర్టిగేషన్ పద్ధతిలో పోషకాలు అందించి మంచి దిగుబడులు సాధించారు. ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ)-2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : మేకల శివశంకరరెడ్డి
ఎక్కడ : రైతు విభాగంలో
ఎందుకు : ఉద్యాన పంటల సాగులో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్నందున

Published date : 28 Nov 2020 06:02PM