ఐరాసకి చెందిన ఏ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 నాణేన్ని ఆవిష్కరించారు?
Sakshi Education
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 16న న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేంపై సహి పోషణ్.. దేశ్ రోషణ్ అని హిందీలో రాశారు. 1945, అక్టోబర్ 16న ఏర్పాటైన ఎఫ్‌ఏవో ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ప్రతి ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ ఫుడ్ డే’గా జరుపుకుంటారు.
ప్రపంచ ఆహార దినోత్సవం 2020 థీమ్: ‘అందరం కలిసి ఆహార పదార్థాలను పెంచుదాం. భవిష్యత్తుకు భరోసానిద్దాం’(Grow, Nourish, Sustain. Together)
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.75 ప్రత్యేక నాణేం విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

Published date : 17 Oct 2020 05:20PM