ఐరాస యంగ్ చాంపియన్స్ అవార్డుకు ఎంపికైన భారతీయడు?
Sakshi Education
ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రకటించిన ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2020’ అవార్డుకు <b>మొత్తం ఏడు మంది</b> ఎంపికయ్యారు.
అవార్డు విజేతల్లో భారత్‌కు చెందిన 29 ఏళ్ల విద్యుత్ మోహన్ కూడా నిలిచారు. పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐరాస ఈ అవార్డులను ప్రకటిస్తోంది. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ మోహన్‌కు ఈ అవార్డు దక్కింది. మోహన్ వృత్తిరీత్యా ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గుటెర్రెస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్-2020 అవార్డుకు ఎంపికైన భారతీయుడు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : విద్యుత్ మోహన్
ఎందుకు : మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ

Published date : 18 Dec 2020 06:44PM