Skip to main content

ఐరాస మాజీ సెక్రటరీ జేవియర్ కన్నుమూత

ఇరాన్, ఇరాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి కుల్లార్(100) కన్నుమూశారు.
Current Affairsపెరూ రాజధాని లిమాలో మార్చి 4న తుదిశ్వాస విడిచారు. లిమాలో 1920, జనవరి 19న జన్మించిన ఆయన 2000, నవంబర్ 22 నుంచి 2001, జూలై 21 వరకు పెరూ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1982, జనవరి 1 నుంచి 1991, డిసెంబర్ 31 వరకు ఐరాస 5వ సెక్రటరీ జనరల్‌గా సేవలందించారు. ఐరాస సెక్రటరీగా ఉన్నప్పడు ప్రపంచ ఆకలిపై పోరాటం, ఇరాన్, ఇరాక్ మధ్య ఎనిమిదేళ్లుగా సాగిన యుద్ధానికి తెరదించడం, ఎల్ సాల్వడార్‌లో అమెరికా ఎగదోసిన అంతర్యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పడం వంటి చర్యలు ఆయన పాలనాదక్షతకు నిదర్శనం. 1990లో నమీబియా స్వాతంత్ర సముపార్జనను తన గొప్ప విజయంగా ఆయన భావిస్తారు. 1973 నుండి 74 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడుగా జేవియర్ వ్యవహరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : జేవియర్ పెరెజ్ డి కుల్లార్(100)
ఎక్కడ : లిమా, పెరూ
Published date : 06 Mar 2020 05:44PM

Photo Stories