Skip to main content

ఐరాస ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి పురస్కారం

ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) 2020 ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Current Affairsప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. యుద్ధం, అంతర్గతపోరుకు ఆకలిని ఆయుధంగా చేసుకోకుండా డబ్ల్యూఎఫ్‌పీ అడ్డుకుందని నోబెల్ కమిటీ తెలిపింది. నార్వే రాజధాని ఓస్లోలో అక్టోబర్ 9న జరిగిన కార్యక్రమంలో నార్వే నోబెల్ ఇన్‌స్టిస్ట్యూట్ 101వ నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించింది. ఈ బహుమానం కింద డబ్ల్యూఎఫ్‌పీకు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. 88 దేశాల్లో ప్రతి ఏటా 9.70 కోట్ల మందికి డబ్ల్యుఎఫ్‌పీ ఆహారాన్ని అందిస్తోందని అంచనా.

100వ విజేతగా అబీ అహ్మద్ అలీ..
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019 సంవత్సరానికి గాను ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది. దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత.
Published date : 09 Oct 2020 03:35PM

Photo Stories