ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలిసారిగా లీగ్ దశలోనే వెనుదిరగడం జట్టు ఇదే...
Sakshi Education
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా మూడుసార్లు మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్‌స (సీఎస్‌కే) నిలిచింది.
అద్భుత ఫామ్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో అక్టోబర్ 25వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినా... మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై రాజస్తాన్ రాయల్స్ జట్టు గెలుపొందడంతో... చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ దశ అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో చెన్నై జట్టు లీగ్ దశలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి.
Published date : 27 Oct 2020 05:55PM