Skip to main content

ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా

దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 నిరవధికంగా వాయిదా వేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 15న ప్రక‌టించింది.
Current Affairs
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా మార్చి29న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభంకావాల్సి ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15వరకు వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపుతో తాజాగా ఐపీఎల్‌-13 రద్దుకే బీసీసీఐ మొగ్గు చూపింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)
ఎందుకు : దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో
Published date : 16 Apr 2020 06:11PM

Photo Stories