ఐఓఏతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒప్పందం
Sakshi Education
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో దిగ్గజ స్టీల్ కంపెనీ జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లబోయే భారత బృందం కోసం అక్కడ ‘ఇండియా హౌజ్’ను జేఎస్‌డబ్ల్యూ నిర్మించనుంది. క్రీడాగ్రామానికి సమీపంలో 2200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తొలిసారి భారత్ అక్కడ ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌజ్‌ను నిర్మించనుంది. దీనికి సంబంధించిన ‘లోగో’ను జేఎస్‌డబ్ల్యూ అక్టోబర్ 10న విడుదల చేసింది. ఇండియా హౌజ్‌లో భారత క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి.
ఒలింపిక్స్ ఆతిథ్య నగరాల్లో అభివృద్ది చెందిన దేశాలు ఇలాంటి హౌజ్‌లను నిర్మించుకోవడం సహజం. కానీ భారత్ మాత్రం ఇలాంటి అధునాతన సౌకర్యాలతో హౌజ్‌ను నిర్మించుకోవడం ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్

Published date : 11 Oct 2019 04:49PM