Skip to main content

ఐల్ ఆఫ్ మ్యాన్ చెస్ టోర్నీ విజేతగా హారిక

ఐల్ ఆఫ్ మ్యాన్ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది.
యునెటైడ్ కింగ్‌డమ్‌లో 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐల్ ఆఫ్ మ్యాన్ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగం విజేత
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ద్రోణవల్లి హారిక
Published date : 23 Oct 2019 05:57PM

Photo Stories