ఐక్యరాజ్యసమితిలో మోదీ ప్రసంగం
Sakshi Education
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగించనున్నారు.
ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్ ఆగస్టు 1న ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు సాధారణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా సెప్టెంబర్ 28వ తేదీ మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాలకోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 02 Aug 2019 05:21PM