ఐక్యరాజ్యసమితి ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు గ్రహీత?
Sakshi Education
జాంబియా దేశానికి చెందిన డోరిన్ మెలాంబో యునెటైడ్ నేషన్స్(యూఎన్) ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు-2020(యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్)కు ఎంపికయ్యారు.
నవంబర్ 3న జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం దక్షిణ సూడాన్ లోని యుఎన్ మిషన్ (యుఎన్మిస్) లో మెలాంబో పనిచేస్తుంది. మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 2011 లో యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్థాపించారు.
సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు: మెలాంబో
ఐరాస అవార్డు లభించిన మెలాంబో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘ ‘నేను యూఎన్ బెస్ట్ పోలీస్ అధికారిగా ఎన్నిక కావటానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయుడు భారత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్. 2008లో యూఎన్ పోలీస్ విభాగంలో ప్రయాణాన్ని ప్రారంభించా. అప్పటి నుంచి సవాంగ్ నాకు దిశానిర్దేశం చేసి సమర్థవంతమైన అధికారిణిగా నిలిచేలా దోహదం చేశారు’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ 2008లో యూఎన్ మిషన్ ఇన్ లైబీరియాకు పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు. 40 దేశాలకు చెందిన పోలీస్ అధికారులకు సారథ్యం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : జాంబియా దేశానికి చెందిన డోరిన్ మెలాంబో

Published date : 09 Nov 2020 06:01PM