Skip to main content

ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రారంభం

హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సెప్టెంబర్ 26న 17వ సీఐఐ-ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2019ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సుమారు వందకు పైగా కంపెనీలు గ్రీన్ బిల్డింగ్ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... జనాభా పెరుగుదల, వలసలు, నియంత్రణ లేని అభివృద్ధి వంటి కారణాల వల్ల సహజ వనరులు దోపిడీకి గురువుతున్నాయని, ఇవే వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలని అన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
17వ సీఐఐ-ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2019 ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 27 Sep 2019 05:49PM

Photo Stories