Skip to main content

ఐఎస్‌ఎస్‌లోకి హ్యూమనాయిడ్ రోబో

రోదసిలోకి రష్యా పంపిన తొలి హ్యూమనాయిడ్ రోబో ఫెడోర్ ఆగస్టు 27న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించింది.
ఈ విషయాన్ని రష్యా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోబోను సోయుజ్ ఎమ్‌ఎస్-14 రాకెట్ ద్వారా ఆగస్టు 22న రోదసిలోకి పంపారు. 2019, సెప్టెంబర్ 7 వరకు ఐఎస్‌ఎస్‌లోనే ఈ రోబో ఉంటుంది. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయజ్ ఎమ్‌ఎస్-14ను ప్రయోగించారు.

రోబో విశేషాలు..
అసలు పేరు :
ఫెడోర్ ( ఫైనల్ ఎక్స్‌పెరిమెంటల్ డెమాన్‌స్ట్రేషన్ ఆబ్జెక్ట్ రీసెర్చ్)
ముద్దుపేరు : స్కైబోట్ ఎఫ్-850హా
ఐఎస్‌ఎస్‌కు ఎలా వచ్చింది : సోయుజ్ ఎమ్‌ఎస్-14 రాకెట్‌లో
తయారు చేసింది : రష్యా అత్యాధునిక పరిశోధన శాఖకు చెందిన ఆండ్రాయిడ్ టెక్నాలజీస్
లక్ష్యం : - కొత్తగా రూపొందించిన అత్యవసర రక్షణ వ్యవస్థను పరీక్షించడం
ప్రత్యేకతలు : - మనుషులు పనిచేయలేని వాతావరణాల్లో కూడాపని చేయగలదు. రోదసీలో నడిచేందుకు కావాల్సిన ఫీచర్లతో డిజైన్
  • టెలీరోబోటిక్ మోడ్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీన్ని ఆపరేట్ చేసేవారు ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రోబో సొంతంగా కూడా పనులు చేయగలదు

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఎస్‌ఎస్‌లోకి హ్యూమనాయిడ్ రోబో ఫెడోర్
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : రష్యా
ఎందుకు : అత్యవసర రక్షణ వ్యవస్థను పరీక్షించడం కోసం
Published date : 28 Aug 2019 05:47PM

Photo Stories