ఐఎస్‌ఎస్‌కు ఎలుకలు, పురుగులు, రోబో
Sakshi Education
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోకి ఓ స్మార్ట్ రోబో, ఎలుకలు, క్రిమిసంహారక పురుగులను చేర్చారు.
స్పేస్ ఎక్స్ అనే అమెరికా సంస్థ డిసెంబర్ 8న వీటిని ఐఎస్‌ఎస్‌కి చేర్చింది. దీనికోసం కేప్ కార్నివాల్(అమెరికా)లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రెండు అంతరిక్ష నౌకల సాయంతో 3 రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. వీటి బరువు 2,720 కిలోగ్రాములు ఉన్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది.
స్పేస్ ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం... ఐఎస్‌ఎస్‌లోకి పంపిన వాటిలో 40 ఎలుకలు ఉన్నాయి. వీటిని కండలు, ఎముకల పరీక్షల కోసం అక్కడకు పంపించారు. వీటిలో జన్యుపరంగా తయారు చేయబడిన ఎలుకలు 8 ఉన్నాయి. వీటి బరువు సాధారణ ఎలుకల కంటే రెట్టింపు ఉంటుంది. అలాగే లక్షా 20 వేల నులి పురుగులు ఉన్నాయి. వీటిని వ్యవసాయంలో క్రిమిసంహారకం కోసం అక్కడకు పంపించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతతో పనిచేసే ‘సిమన్’ అనే రోబోను ఐఎస్‌ఎస్‌లోకి పంపారు. దీనిని వ్యోమగాముల భావాలను అర్థం చేసుకోవడానికి పంపించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌కు ఎలుకలు, పురుగులు, రోబో
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : స్పేస్ ఎక్స్ అనే అమెరికా సంస్థ
ఎందుకు : ప్రయోగాల కోసం

Published date : 09 Dec 2019 06:04PM