ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నిలో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
చైనాలోని బీజింగ్‌లో ఏప్రిల్ 25న జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్-సౌరభ్ చౌధరీ ద్వయం ఫైనల్లో 16-6తో పాంగ్ వె-జియాంగ్ రాన్‌జిన్ (చైనా) జంటను ఓడించి పసిడి పతకం గెలిచింది. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్-దివ్యాంశ్ సింగ్ జోడీ 17-15తో లియు రుజువాన్-యాంగ్ హావోరన్ (చైనా) ద్వయంపై గెలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నిలో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : మను భాకర్-సౌరభ్ చౌధరీ ద్వయం, అంజుమ్ మౌద్గిల్-దివ్యాంశ్ సింగ్ జోడీ
ఎక్కడ : బీజింగ్, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నిలో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : మను భాకర్-సౌరభ్ చౌధరీ ద్వయం, అంజుమ్ మౌద్గిల్-దివ్యాంశ్ సింగ్ జోడీ
ఎక్కడ : బీజింగ్, చైనా
Published date : 26 Apr 2019 06:57PM