ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
Sakshi Education
భారత్‌లో జరగాల్సిన ప్రతిష్టాత్మక షూటింగ్ ప్రపంచ కప్ టోర్నమెంట్ వాయిదా పడింది.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ విజృంభిస్తుండటంతో పాటు... దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడంతో ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) మార్చి 6న తెలిపింది. షెడ్యూల్ ప్రకారం 2020, మార్చి 15 నుంచి 25 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ విజృంభణ కారణంగా టోర్నీని ప్రస్తుతం నిర్వహించడం సాధ్యం కాదని ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) తెలిపింది. అంతేకాకుండా టోర్నీలో పాల్గొనే 22 దేశాలు కూడా చివరి నిమిషంలో వైదొలిగాయని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్)
ఎక్కడ : న్యూఢిల్లీ, భారత్
ఎందుకు : కోవిడ్-19 వైరస్ విజృంభిస్తుండటంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ వాయిదా
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్)
ఎక్కడ : న్యూఢిల్లీ, భారత్
ఎందుకు : కోవిడ్-19 వైరస్ విజృంభిస్తుండటంతో
Published date : 07 Mar 2020 05:51PM