Skip to main content

ఐఎస్‌ఎల్ ఆరో సీజన్ విజేతగా డి కోల్‌కతా

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు విజేతగా అవతరించింది. గోవాలోని మార్గవో నగరంలో ఉన్న ఫటోర్డా స్టేడియంలో మార్చి 14న జరిగిన ఫైనల్లో కోల్‌కతా 3-1 గోల్స్ తేడాతో చెన్నైరుున్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్‌ఎల్ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా డి కోల్‌కతా గుర్తింపు పొందింది.
Current Affairsఇప్పటివరకు ఆరు సీజన్‌లు జరగ్గా... అందులో కోల్‌కతా (2014, 2016, 2019-20), చెన్నైరుున్ రెండు సార్లు (2015, 2017-18), బెంగళూరు ఒకసారి (2018-19) విజేతలుగా నిలిచాయి.

వాల్‌స్కీస్‌కు గోల్డెన్ బూట్..
ఆరో సీజన్ చాంపియన్ కోల్‌కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్ చెన్నైరుున్ రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీగా లభించారుు. 15 గోల్స్ సాధించిన చెన్నైరుున్ ఆటగాడు వాల్‌స్కీస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లవ్ అవార్డును బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ సుమీత్ (కోల్‌కతా)... ‘హీరో ఆఫ్ ద లీగ్’గా హ్యూగో బౌమౌస్ (గోవా ఎఫ్‌సీ) నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఐఎస్‌ఎల్ ఆరో సీజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : అట్లెటికో డి కోల్‌కతా జట్టు
ఎక్కడ : ఫటోర్డా స్టేడియం, మార్గవో, గోవా
Published date : 16 Mar 2020 06:44PM

Photo Stories