ఐఎంఎఫ్ వార్షిక సదస్సులో నిర్మలా
Sakshi Education
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 18న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మలా విలేకరులతో మాట్లాడుతూ... భారత్ వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వాణిజ్యపరమైన అంశాలపై అమెరికాతో నెలకొన్న విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోగలవని నిర్మల తెలిపారు. అక్టోబర్ 14న ప్రారంభమైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 20న ముగియనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
Published date : 19 Oct 2019 05:20PM