ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా
Sakshi Education
భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు సెప్టెంబర్ 19న కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
2019, సెప్టెంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. 1980లో యుద్ధ విమాన పైలట్‌గా ఉన్న రాకేశ్ 40ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 26 రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. 2019, మే నెల నుంచి వైమానిక దళం వైస్ చీఫ్‌గా రాకేశ్ పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వైమానిక దళం నూతన అధిపతిగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వైమానిక దళం నూతన అధిపతిగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియా
Published date : 20 Sep 2019 05:37PM