Skip to main content

ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష

కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్‌’’ను ఆవిష్కరించినట్లు అబాట్‌ ల్యాబొరేటరీస్ మార్చి 27న ప్రకటించింది.
Current AffairsID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో అనుమానిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని ఐదు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తాజాగా అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) దీనికి అనుమతులిచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ పరీక్షలను అన్ని ఫిజీషియన్స్‌ ఆఫీసులు, అత్యవసర సంరక్షణ క్లినిక్‌లు, హాస్పిటల్‌లో సులభంగా జరపవచ్చని పేర్కొంది.
Published date : 30 Mar 2020 06:48PM

Photo Stories