ఐదు హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు
Sakshi Education
సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, కర్ణాటక హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి ఏప్రిల్ 11న సిఫార్సు చేసింది.
అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న సీనియర్ జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్ పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఖరారు చేసినట్లు కొలీజియం తెలిపింది.
అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌ను రాజస్తాన్ హైకోర్టు సీజేగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ పి.ఆర్.రామచంద్ర మీనన్‌ను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసినట్లు కొలిజియం వెల్లడించింది. జస్టిస్ ఏకే మిట్టల్ పేరును మేఘాలయ సీజేగా ఖరారు చేసినట్లు పేర్కొంది. వీరితో పాటు జస్టిస్ ఎ.ఎస్.ఓకా పేరును కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది.

Published date : 12 Apr 2019 05:52PM