Skip to main content

ఐదేళ్ల నిషేధానికి గురైన అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెటర్‌?

అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) క్రికెటర్‌ ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఐదేళ్ల నిషేధం విధించింది.
Current Affairs 2019 ఏప్రిల్‌లో జింబాబ్వేతో... 2019 ఆగస్టులో నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌ల సందర్భంగా ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశాడని రుజువు కావడంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. ఇదే కారణంతో హీత్‌ స్ట్రీక్‌ (జింబాబ్వే), దిల్హారా (శ్రీలంక)లపై కూడా ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌...
రాజధాని: అబుదాబి; కరెన్సీ: యూఏఈ దీర్హం
యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు: ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌
యూఏఈ ప్రస్తుత ప్రధాని, ఉపాధ్యక్షుడు: మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఐదేళ్ల నిషేధానికి గురైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెటర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌
ఎందుకు : ఐసీసీ నిర్వహించిన మ్యాచ్‌ల గురించి.. ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశాడని రుజువు కావడంతో
Published date : 22 Apr 2021 07:42PM

Photo Stories