ఐబీఎస్‌ఎఫ్ బిలియర్డ్స్ విజేతగా పంకజ్
Sakshi Education
అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత చాంపియన్ ఆటగాడు పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు.
మయన్మార్‌లోని మాండలేలో సెప్టెంబర్ 15 జరిగిన 150-అప్ ఫార్మాట్ పోరులో పంకజ్ 6-2 ఫ్రేమ్‌లతో స్థానిక మయన్మార్ ఆటగాడు నే త్వే వూపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో పంకజ్ కెరీర్‌లో 22వ ఐబీఎస్‌ఎఫ్ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. 150-అప్ అనేది బిలియర్డ్స్‌లో పొట్టి ఫార్మాట్ కాగా... ఇందులో గత ఆరేళ్లలో పంకజ్ అద్వానీ ఐదు టైటిల్స్ సాధించాడు.
2003లో తొలిసారి చాంపియన్‌షిప్ అందుకున్న పంకజ్ తదనంతరం టైమ్ ఫార్మాట్‌లో 8 సార్లు, పాయింట్స్ ఫార్మాట్‌లో సార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ సాధించాడు. స్నూకర్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత క్యూ స్టార్ ప్రపంచ టీమ్ బిలియర్డ్స్, టీమ్ స్నూకర్‌లో ఒక్కోసారి విజయం సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : పంకజ్ అద్వానీ
ఎక్కడ : మాండలే, మయన్మార్

Published date : 16 Sep 2019 05:42PM