Skip to main content

ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ

అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్ కృష్ణ నియమితులయ్యారు.
Current Affairs200 బిలియన్ డాలర్ల సంస్థ డెరైక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. 2020, ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుందని జనవరి 31న కంపెనీ వెల్లడించింది. అరవింద్‌తో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జేమ్స్ వైట్‌హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1990లో ఐబీఎంలో చేరిన అరవింద్ అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్) స్థాయికి చేరారు.

అరవింద్ ప్రస్థానం ఇలా...
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో పీహెచ్‌డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ-రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్‌వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) నియామకం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : అరవింద్ కృష్ణ
Published date : 04 Feb 2020 05:07PM

Photo Stories