Skip to main content

ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలో మోదీ

తమిళనాడు రాజధాని చెన్నైలో సెప్టెంబర్ 30న జరిగిన ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
భారత్ వైపు ప్రపంచం ఒక ఆశావహ దృక్పథంతో చూస్తోందని, భారతీయ యువత శక్తి సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం చూపుతోందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. గృహావసరాలకు వాడుతున్న నీటిని పునర్వినియోగించడంపై, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌కు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. అలాగే, విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ఫిట్‌నెస్ పైన దృష్టిపెట్టాలని కోరారు.మరోవైపు ‘సింగపూర్, ఇండియా హ్యాకథాన్ 2019’ విజేతలకు మోదీ బహుమతులను అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
Published date : 01 Oct 2019 05:34PM

Photo Stories