ఐఐటీ హైదరాబాద్‌తో భాగస్వామ్యం చేసుకున్న టెక్నాలజీ సంస్థ?
Sakshi Education
హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (హెచ్‌టీఎస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ల్యాబ్ ఏర్పాటుతో పాటు కొత్త టెక్నాలజీలపై సంయుక్తంగా పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ల్యాబ్‌ను ఆగస్టు 18న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా దేశంలోనే ఏఐలో పూర్తి స్థాయి బీటెక్ కోర్సు అందిస్తున్న తొలి విద్యా సంస్థ ఐఐటీ–హెచ్ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను ఆగస్టు 18న ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–హైదరాబాద్ (ఐఐటీ–హెచ్)తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ (హెచ్‌టీఎస్)
ఎందుకు : హైదరాబాద్‌లో ఏఐ ల్యాబ్ ఏర్పాటుతో పాటు కొత్త టెక్నాలజీలపై సంయుక్తంగా పరిశోధనలకు తోడ్పడుతుందని....

Published date : 19 Aug 2021 06:30PM