Skip to main content

అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Current Affairs ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అహ్మదాబాద్ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఏపీ అవినీతి నిరోధకశాఖ చీఫ్ విశ్వజిత్ నవంబర్ 21న సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 2020, ఫిబ్రవరి మూడోవారం నాటికి అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక అందిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం
Published date : 22 Nov 2019 06:26PM

Photo Stories