ఆగస్టు తర్వాత కశ్మీర్ శాసనసభ ఎన్నికలు
Sakshi Education
2019, ఆగస్టు 15న అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) జూన్ 4న తెలిపింది.
అమర్‌నాథ్ యాత్ర జూలై నెలలో ప్రారంభం కానుంది. 2018 జూన్‌లో పీడీపీ-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం కశ్మీర్‌లో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వ పాలన లేదు. ఆ రాష్ట్రంలో 2018 జూన్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జూన్ 19న రాష్ట్రపతి పాలన గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు అంతా సిద్ధం చేశారు.
Published date : 05 Jun 2019 05:46PM