Skip to main content

అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభకు హాజరైన వారిలో 323 మంది బిల్లుకు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ 10 శాతం రిజర్వేషన్లు అమలైతే బ్రాహ్మణ, కమ్మ, కాపు, రాజ్‌పుత్, జాట్, మరాఠా, భూమిహార్ తదితర కులాల్లోని పేదలకు లబ్ధి చేకూరనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : లోక్‌సభ
Published date : 09 Jan 2019 05:35PM

Photo Stories