అగ్రవ ర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Sakshi Education
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది.
బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ మాట్లాడుతూ... జనరల్ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని అన్నారు. జనవరి 8న లోక్‌సభలో ఈ బిల్లు 323-3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగ్రవ ర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : రాజ్యసభ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగ్రవ ర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : రాజ్యసభ
Published date : 10 Jan 2019 04:37PM