Skip to main content

అధునాతన మిస్సైళ్ల విక్రయానికి అమెరికా ఆమోదం

భార‌త్‌కు 155 మిలియన్ డాలర్ల విలువైన హార్పూన్‌ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్‌డ్ మిసైళ్లు, తేలికపాటి టోర్పిడోలు విక్రయించాల‌ని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
ఈ మేర‌కు మిస్సైళ్ల విక్రయానికి ఏప్రిల్ 13న అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10 ఏజీఎం -84ఎల్ హార్పూన్‌ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్, 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టోర్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ టార్పిడోల‌ు భారత్ కు రానున్నాయి. భారత్‌కు ప్రాంతీయంగా తలెత్తే ముప్పును తిప్పికొట్టడానికి ఈ ఆయుధాలు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. విమానాల నుంచి ప్రయోగించే హార్పూన్‌ క్షిపణులను శత్రు నౌకల విధ్వంసానికి ఉపయోగిస్తారు. వీటిని భారత నౌకాదళంలోని పి-8ఐ విమానాల్లో అమరుస్తారు. శత్రు జలాంతర్గాముల విధ్వంసానికి ఉపయోగ‌ప‌డే ఎంకే 54 టోర్పిడోలను రేథియాన్‌ కంపెనీ తయారుచేస్తోంది. హార్పూన్‌ క్షిపణులను బోయింగ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భార‌త్‌కు అధునాతన మిస్సైళ్ల విక్రయానికి ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : అమెరికా ప్రభుత్వం
Published date : 15 Apr 2020 06:59PM

Photo Stories