అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
Sakshi Education
కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా చైనాలోని షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు, సహా ఇతర అడవి జంతువుల మాంసంపై శాశ్వత నిషేధం విధించింది.
సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో 2019, డిసెంబరులో మొట్టమొదట మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్‌జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : షెన్‌జెన్
ఎందుకు : కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా
2020, మే 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని షెన్‌జెన్ నగర అధికారులు వెల్లడించారు. 'ఆధునిక సమాజానికి సార్వత్రిక నాగరికత అవసరం' అని ప్రకటించారు. దీంతో పిల్లి, కుక్క మాంసం వ్యాపారం, వినియోగాన్ని శాశ్వతంగా నిషేధించిన చైనా మొట్టమొదటి నగరంగా షెన్‌జెన్ అవతరించింది. మరోవైపు ఇది చారిత్రాత్మక నిర్ణయంమంటూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కు చెందిన ప్రముఖుడు డాక్టర్ పీటర్ లి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో 2019, డిసెంబరులో మొట్టమొదట మొట్టమొదట కరోనా వైరస్ ను గుర్తించారు. వూహాన్ నగరంలో జంతు వధశాల కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించిందనే వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కుక్క మాంసం వ్యాపారం జరిగే చైనాలోని నగరాల్లో షెన్‌జెన్ ఐదవ అతిపెద్ద నగరం. 12.5 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తారు. తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ వీటి మాంసం విక్రయాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడవి జంతువుల మాంసం నిషేధించిన తొలి చైనా నగరం
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : షెన్‌జెన్
ఎందుకు : కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా
Published date : 03 Apr 2020 06:54PM