ఆడపిల్లల వివాహ వయస్సు పెంపుపై టాస్క్‌ఫోర్స్
Sakshi Education
కేంద్ర బడ్జెట్2020-21లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ... ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారని, బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించిందని పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు..
రవాణ రంగ అభివృద్ధికి బడ్జెట్‌లో కొత్త వ్యూహాలు
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు
- బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది
- ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర కంటే బాలికలే ఐదు శాతం ఎక్కువ ఉన్నారు
- ఆరు లక్షలమంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
- పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి
- మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
- పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు
- పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు..
- యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
- గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
- ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు
- ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్
- మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
- ఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
- మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
రవాణ రంగ అభివృద్ధికి బడ్జెట్‌లో కొత్త వ్యూహాలు
- ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
- రాంచీలో ట్రైబల్ మ్యూజియం
- అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్ మ్యూజియం
- పర్యాటక అభివృద్ధికి తేజాస్ రైళ్లు
- రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
- వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
- 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి
- ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
- పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
Published date : 01 Feb 2020 01:05PM