Skip to main content

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా కార్యాలయం ఎక్కడ ఉంది?

తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)ని అధ్యయనం చేయమని కోరింది.
Current Affairsఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని తన నివేదికలో సిఫారసు చేసింది. ఆస్కీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం ఆస్కీ చైర్మన్‌గా కె.పద్మనాభయ్య ఉన్నారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఏర్పాటు...
తెలంగాణలో హార్టికల్చర్‌ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ఫిబ్రవరి 26న ప్రకటించారు.
Published date : 27 Feb 2021 05:53PM

Photo Stories