ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
Sakshi Education
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న విశాఖపట్నం జిల్లా అరకు లోయలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల భివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. రూ.66 కోట్లను కేటాయించి ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 2019-20 బడ్జెట్‌లో రూ.4,988 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
ఎక్కడ : అరకు, విశాఖట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆదివాసీ ఉత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి
ఎక్కడ : అరకు, విశాఖట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Aug 2019 07:29PM